7-150-సీ.
మందార మకరంద మాధుర్యమునఁ; దేలు మధుపంబు
బోవునే మదనములకు?
నిర్మల మందాకినీ వీచికలఁ దూఁగు; రాయంచ జనునె తరంగిణులకు?
లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు; కోయిల చేరునే కుటజములకుఁ?
బూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరక; మరుగునే సాంద్ర నీహారములకు?
తే. నంబుజోదర దివ్య పాదారవింద

చింత నామృత పాన విశేష మత్త
చిత్త మే రీతి నితరంబుఁ జేర నేర్చు?
వినుతగుణశీల! మాటలు వేయు నేల?"
తండ్రి హిరణ్యాక్షుడు “హరి గిరి అనకు” అన్నాడు. ప్రహ్లాదుడు నీతిశాలి కదా. గురువు చండామార్కుల వారికి సమాధానం చెప్పాడు. వినుతగుణశీల అని సంబోధించాడు. ఆ సందర్భంలోది ఈ అమృత గుళిక.
ప్రఖ్యాత చరితుడా! వినవయ్య నా మాట. ఎన్నో మాటల్లో చెప్పటం అనవసర మయ్య. ఎవని నాభి యందు సృష్టికర్త పుట్టిన పద్మం జనించిందో ఆ విష్ణుదేవుని దివ్య మైన పాదపద్మాలను ధ్యానించటంలోనే, ఆ అమృతం ఆస్వాదించటంలోనే సదా పరవశిస్తు ఉంటుంది నా మనస్సు. మరి మందార పూల మకరందంలోని మాధుర్యం మరిగిన తుమ్మెద ఉమ్మెత్తపూల వైపు పోదుగదా. స్వచ్చ మైన ఆకాశగంగా తరంగాలపై విహరించే రాజహంస వాగులు వంకల దగ్గరకు చేరదు కదా. తియ్య మామిడి లేత చిగుర్లు తిని పులకించి పాటలుపాడే కోకిల కొడిసిచెట్ల పైకి వెళ్ళదు కదా. నిండు పున్నమి వెన్నెలలో విహారాలు చేసే చకోర పక్షి దట్టమైన మంచు తెరల మాటుకి పోదుకదా. అలాగే ఇతర విషయాల పైకి నా చిత్తం వెళ్ళదు.
మందార మకరంద మాధుర్యమునఁ దేలు - మందార = మందారము యొక్క; మకరంద = పూతేనె యొక్క; మాధుర్యమునన్ = తీయదనము నందు; తేలు = ఓలలాడెడి; మధుపంబు బోవునే - మధుపంబు = తుమ్మెద; పోవునే = వెళుతుందా; మదనములకు - మదనముల = ఉమ్మెత్తపూల; కున్ = కు; నిర్మల = స్వచ్ఛమైన; మందాకినీ వీచికలఁ దూఁగు - మందాకినీ = గంగానది యొక్క; వీచికలన్ = తరంగములందు; తూగు = ఊగెడి; రాయంచ జనునె - రాయంచ = రాజ హంస; చనునె = పోవునా; తరంగిణులకు - తరంగిణుల్ = (సాధారణ) ఏరుల; కున్ = కు; లలిత రసాల పల్లవ ఖాది యై - లలిత = చక్కటి; రసాల = మామిడి; పల్లవ = చిగుర్లను; ఖాది = తినునది; ఐ = అయ్యుండి; చొక్కు = మై మరచెడి; కోయిల = కోయిల; చేరునే = దగ్గరకు వచ్చునా ఏమి; కుటజములకుఁ బూర్ణేందు చంద్రికా - కుటజముల = కొండమల్లె, కొడిసెచెట్ల; కున్ = కు; పూర్ణేందు = నిండుజాబిల్లి; చంద్రికా = వెన్నల; స్పురిత చకోరక మరుగునే - స్పురిత = స్పందించెడి; చకోరకము = వెన్నెలపులుగు; అరుగునే = వెళ్లునా ఏమి; సాంద్ర నీహారములకు నంబుజోదర - సాంద్ర = దట్టమైన; నీహారముల్ = మంచుతెరల; కున్ = కు; అంబుజోదర = నారాయణుని {అంబు జోదరుడు - అంబుజము (పద్మము) ఉదరుడు (పొట్టనగలవాడు), విష్ణువు}.
దివ్య పాదారవింద - దివ్య = దివ్యమైన; పాద = పాదము లనెడి; అరవింద = పద్మముల; చింత నామృత పాన విశేష మత్త - చింతనా = ధ్యానము యనెడి; అమృత = అమృతమును; పాన = తాగుటచే; విశేష = మిక్కలిగా; మత్త = మత్తెక్కిన; చిత్త మేరీతి నితరంబుఁ జేర నేర్చు - చిత్తము = మనసు; ఏ = ఏ; రీతిన్ = విధముగ; ఇతరము = వేరొంటిని; చేరన్ = చేరుటను; నేర్చున్ = చేయగలదా ఏమి; వినుత గుణశీల - వినుత = స్తుతింపదగిన; గుణ = సుగుణములుగల; శీల = వర్తనగలవాడ; మాటలు వేయు నేల - మాటలు = మాటలు చెప్పుట; వేయున్ = అనేకము; ఏలన్ = ఎందులకు.
తెలుగుభాగవతం.కం http://www.telugubhagavatam.com/

|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి