1-3-ఉ.
ఆతత సేవఁ జేసెద సమస్త
చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు భారతీ హృదయ
సౌఖ్య విధాతకు వేదరాశి ని
ర్ణేతకు దేవతా నికర
నేతకుఁ గల్మష జేతకున్ నత
త్రాతకు ధాతకున్ నిఖిల
తాపస లోక శుభ ప్రదాతకున్.
సమస్త చరాచర
సృష్టి నిర్మాణం చేయడం సంపూర్ణంగా తెలిసిన వాడు, సరస్వతీదేవికి హృద యానంద ప్రదాత అయినవాడు,
వేదాలన్నిటిని సమర్ధంగా సమకూర్చినవాడు,
సకల దేవతామూర్తులను తీర్చిదిద్దినవాడు, సమస్త పాపాలను పటాపంచలు చేసేవాడు,
దీనుల దప్పక కాచువాడు. తపోధను లందరికి సుభా లొనగూర్చేవాడు అయినట్టి ఆ బ్రహ్మ దేవుని
శ్రద్ధాభక్తులతో సేవిస్తాను.
1-3-ఉ. | ఆతతసేవఁజేసెద
- ఆతత = అతిశయమైన; సేవన్ = భక్తిని;
చేసెదన్ = చేసెదను;
సమస్తచరాచరభూతసృష్టి విజ్ఞాతకు
- సమస్త = సమస్తమైన;
చర = చరములు;
అచర = అచరములుయైన;
భూత = ప్రాణులను;
సృష్టి = సృష్టించే;
విజ్ఞాత = నేర్పరి;
కున్ = కి;
భారతీహృదయసౌఖ్యవిధాతకు - భారతీ = భారతీ దేవి;
హృదయ = హృదయానికి;
సౌఖ్య = సంతోషాన్ని;
విధాత = కలిగించేవాడు;
కున్ = కి;
వేదరాశినిర్ణేతకు - వేద = వేదాల;
రాశి = సమూహాలను;
నిర్ణేత = ఏర్పరిచిన వాడు;
కున్ = కి;
దేవతానికరనేతకుఁగల్మషజేతకున్ - దేవతా = దేవతల;
నికర = సమూహము యొక్క;
నేత = నాయకుడు;
కున్ = కి;
కల్మష = పాపములను;
ఛేత్త = ఛేధించే వాడు;
కున్ = కి;
నతత్రాతకు - నత =
నమస్కరించే వారిని; త్రాత = రక్షించే వాడు;
కున్ = కి;
ధాతకున్ - ధాత =
బ్రహ్మ; కున్ = కి;
నిఖిలతాపసలోకశుభప్రదాతకున్ - నిఖిల = మొత్తం;
తాపస = తాపసులు;
లోక = అందరికి;
శుభ = శుభాలను;
ప్రదాత = ఇచ్చేవాడు;
కున్ = కి.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి