10.1-307-క.
బాలురకుఁ బాలు లే వని
బాలింతలు మొఱలుపెట్టఁ బకపక నగి యీ
బాలుం డాలము చేయుచు
నాలకుఁ గ్రేపులను విడిచె నంభోజాక్షీ!
గోపికలు బాలకృష్ణుని
అల్లరి యశోదకు ఇలా పిర్యాదు చేస్తున్నారు. కమలలాంటి కన్నులున్న అమ్మా. అసలే పిల్లలకి
తాగటానికి పాలు సరిపోటం లే దని పసిపిల్లల తల్లులు
గోలపెడుతుంటే, నీ కొడుకు పకపక నవ్వుతూ, వెక్కిరిస్తూ ఆవులకు లేగదూడల తాళ్ళువిప్పి
వదిలేస్తున్నాడు చూడమ్మ.
ఙ్ఞానముచే కలిగిన
దృష్టి కలామె అంభోజాక్షి. గోపికలు అంటే ముముక్షువులు. బాలు రంటే అఙ్ఞానులు. బాలింతలు
అంటే వారిని పోషించే ఙ్ఞానప్రదాతలు. వారు అఙ్ఞానులకి సరిపడినంత మోక్షం అనే పాలు
అందటం లేదని తపిస్తున్నారట. ఎందుకంటే, బలం అంటే శక్తికి కారణభూతుడైన ఈ బాలుడు
వేదాలు అనే ఆవులకి మోక్షాపేక్ష గల వా
రందరిని వదిలేస్తున్నా డట.
బాలురకుఁ
బాలు లేవని - బాలురు = పిల్లల; కున్ = కి; పాలు = తాగుటకు
పాలు;
లేవు = లేవు; అని = అని; బాలింతలు = పసిబిడ్డల
తల్లులు; మొఱలుపెట్టఁ బకపక - మొఱలుపెట్టన్ = మొత్తుకొనగా; పకపక = పకపక అని; నగి = నవ్వి; యీ -
ఈ = ఈ; బాలుం
డాలము - బాలుండు = పిల్లవాడు; ఆలమున్ = అల్లరి పెట్టుట,
పరిహాసము; చేయుచు నాలకుఁ గ్రేపులను - చేయుచున్ = చేస్తూ; ఆల = ఆవుల; కున్ = కు; క్రేపులను = దూడలను; విడిచె
నంభోజాక్షీ - విడిచెన్ = వదలిపెట్టెను; అంభోజాక్షీ = సుందరీ {అంబోజాక్షి
– నీటిలో పుట్టిన పద్మాల్లాంటి కన్ను లున్నామె,
స్త్రీ}.
|| ఓం నమో భగవతే వాసుదేవాయః ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి