భగవంతుడు సర్వేశ్వరుడు దయామయుడు, కనుక దుష్ట శిక్షణార్థం, శిష్ఠ రక్షణార్థం యుగ యుగం లోను అవతరిస్తాడు. ఎప్పుడైతే అన్యాయాలు అక్రమాలు మితిమీరుతుంటాయో పాపం పెరిగిపోతుంటుందో, అప్పుడు శ్రీమన్నారాయణుడు అనేక రూపాలలో అవతరించి ధర్మాన్ని కాపాడతాడు. ఇట్టి భగవంతుని అవతారాలు లెక్కపెట్టలేనన్ని వచ్చాయి, రాబోతున్నాయి. అవి అనంతం. వీటిలో ముఖ్యమైన వానిని *దశావతారాలు అని స్మరిస్తుంటాము. ఇవి అందరికి తెలిసినవే. అయితే పెద్దలు పురాణేతిహాసాలలో అనేకమైన వానిని ప్రస్తావిస్తారు. అలానే భాగవతంలో ఏకవింశతి అవతారాలు (21), చతుర్వింశతి అవతారాలు (24) అని చెప్పారు. ఆయా కాలాలు, అవసరాలను బట్టి ఆయా అవతారాలు ధరించి ఆయా ఘన కార్యాలు సాధించి దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడతాడు భగవంతుడు.
ఈ ఏకవింశతి అవతారాలు (21), చతుర్వింశతి అవతారాలు (24) పేర్లు మన తెలుగుభాగవతండాట్ కాం లో చూడొచ్చు.
*దశావతారాలు - 1వరాహ 2మత్స్య 3కూర్మ 4నరసింహ 5వామన 6పరశురామ 7శ్రీరామ 8శ్రీకృష్ణ 9బుధ 10కల్కి అని పది అవతారాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి