17, ఆగస్టు 2012, శుక్రవారం

భగవంతుని అవతారాలు.

                భగవంతుడు సర్వేశ్వరుడు దయామయుడు, కనుక దుష్ట శిక్షణార్థం, శిష్ఠ రక్షణార్థం యుగ యుగం లోను అవతరిస్తాడు. ఎప్పుడైతే అన్యాయాలు అక్రమాలు మితిమీరుతుంటాయో పాపం పెరిగిపోతుంటుందో, అప్పుడు శ్రీమన్నారాయణుడు అనేక రూపాలలో  అవతరించి ధర్మాన్ని కాపాడతాడు. ఇట్టి భగవంతుని అవతారాలు లెక్కపెట్టలేనన్ని వచ్చాయి, రాబోతున్నాయి. అవి అనంతం. వీటిలో ముఖ్యమైన వానిని *దశావతారాలు అని స్మరిస్తుంటాము. ఇవి అందరికి తెలిసినవే. అయితే పెద్దలు పురాణేతిహాసాలలో అనేకమైన వానిని ప్రస్తావిస్తారు. అలానే భాగవతంలో ఏకవింశతి అవతారాలు (21), చతుర్వింశతి అవతారాలు (24) అని చెప్పారు. ఆయా కాలాలు, అవసరాలను బట్టి ఆయా అవతారాలు ధరించి ఆయా ఘన కార్యాలు సాధించి దుష్టులను శిక్షించి ధర్మాన్ని కాపాడతాడు భగవంతుడు. 
 
ఏకవింశతి అవతారాలు (21), చతుర్వింశతి అవతారాలు (24) పేర్లు మన తెలుగుభాగవతండాట్ కాం లో చూడొచ్చు.

*దశావతారాలు - 1వరాహ 2మత్స్య 3కూర్మ 4నరసింహ 5వామన 6పరశురామ 7శ్రీరామ 8శ్రీకృష్ణ 9బుధ 10కల్కి అని పది అవతారాలు.

14, ఆగస్టు 2012, మంగళవారం

తెలుగు భాగవతము

     బమ్మెర పోతనామాత్యుల వారు తెలుగు వారందరికీ ఆరాధ్యనీయులు, ప్రాతస్మరణీయులు, మహా కవి, సహజ కవి, ప్రజా కవి. ఆంధ్ర భాష ఉన్నంత వరకు, ఆంధ్రులు ఉన్నంత వరకు ఉండేవి వీరి కృతులు.

    వ్యాస మూలం నుండి ప్రాంతీయ భాషలలోకి వచ్చిన శ్రీ మద్భాగవతాలలో వీరి తెలుగు సేత భాగవతము ప్రప్రథమ మైనది, అత్యుత్తమ మైనది. ఇదే కాక భోగినీ దండకం, వీరభద్ర విజయం కూడా వీరి కృతులే. 

     పోతన గారి పలుకులు, వాటికి  చెందిన వాటిని క్రమం తప్పకుండా స్మరించి తరించాలని ఇది మొద లెట్టాను. సహృదయులు, భాగవత ప్రియులు, భాషాభిమానులు ఆదరించి ప్రోత్సహించండి.
 ----------------------------------------------------------------------------------------------
   శ్రీ రాముడు కనిపించి ఆజ్ఞాపించాడట. శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై అంటు మొదలెట్టాడు భాగవత ఆంద్రీకరణ. శ్రీకృష్ణుని స్మరిస్తూ కైవల్య పదం (మోక్షం) కావాలని కోరుకున్నాడు. లోకాన్ని కాపాడేవాడు, భక్తులను చల్లగా చూసేవాడు, తమో గుణ మనే రాక్షసాన్ని అణచేవాడు, బ్రహ్మాండ భండాలని లీలగా ఆడించే వాడు ఐన యశోద కృష్ణుడిని వేడుకొన్నాడు.
    ఈ పద్యం టికా, టిప్పణి చూడటానికి, వినడానికి కింద లింకుపై క్లిక్ చేయండి.